ప్రజాశక్తి-కాకినాడ, కార్పొరేషన్ కాకినాడ రాయల్ పార్క్ హోటల్లో ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సీల్ కార్యవర్గ ప్రమాణ స్వీకారం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఎఐసిసి రాష్ట్ర కార్యదర్శి విక్టర్ శామ్యూల్ అద్యక్షత వహించగా ఉపాద్యక్షుడు జోసఫ్ బెన్నీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జెహెచ్ హౌలేన్ మాట్లాడారు. నూతన కార్యవర్గానికి సిటీ ఎంఎల్‌ఎ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి నియామక పత్రాలను అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రైస్తవులకు తాను ఎప్పుడూ అండగా ఉంటానని చెప్పారు. క్రిస్టియన్ మైనార్టీల సంక్షేమానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో సోనీవుడ్, శామ్యూల్ సాగర్, ఏల్చూరి పాపారావు, ఎంఎస్.విలియమ్స్, జాషువా గూటం, కెజి.కుమార్, మోజెస్ బాబు, రిక్కి గూటం, స్టీఫెన్ ఆనంద్, సౌమ్యా సుమలత తదితరులు పాల్గొన్నారు.










