Aug 20,2023 20:38

క్రికెట్‌ విజేత టీమ్‌

ప్రజాశక్తి-నెల్లూరు : స్థానిక బుజబుజనెల్లూరు ప్రాంతంలోని క్రికెట్‌ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆంద్రా స్టేడియంలో రావాణా శాఖ సిబ్బంది నిర్వహించిన జిల్లా క్రికెట్‌ టోర్మమెంట్‌ విజేతగా 'నెల్లూరు రాయల్స్‌' జట్టు నిలిచింది. ఆదివారం నిర్వహించిన ఈ క్రికెట్‌ టోర్మమెంట్‌లో రెండు జట్టు పాల్గొన్నాయి. నెల్లూరు రవాణా శాఖ కార్యాలయం సిబ్బంది నెల్లూరు రాయల్స్‌ పేరుతో ఒక జట్టు, కావలి ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయం సిబ్బంది కావలి కింగ్స్‌ టీం పేరుతో రెండవ జట్టు ఈ పోటీలో పాల్గొన్నాయి. నెల్లూరు రాయల్స్‌ క్రికెట్‌ టీంకు ఉప రవాణాకమిషనర్‌ శ్రీచందర్‌ కెప్టన్‌గా వ్యవహరించగా కావలి కింగ్స్‌ జట్టుకు సుధాకర్‌రెడ్డి కెప్టన్‌గా వ్యవహరించారు. మొదటగా టాస్‌ ఎంచుకున్న నెల్లూరు రాయల్స్‌ జట్టు ఫీల్డింగ్‌ ఎంచుకున్నారు. మొట్టమొదటిగా బ్యాటింగ్‌ చేసిన కావలి కింగ్స్‌ జట్టు ఎనిమిది వికెట్లు కోల్పోయి 147 పరుగులు సాధించింది. 148 పరుగుల లక్ష్యంతో ఆటను ప్రారంభించిన నెల్లూరు రాయల్స్‌ క్రీడాకారులు కేవలం మూడు వికెట్లను కోల్పోయి, మూడు ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని అధిగమించారు. ఈ టోర్మమెట్‌లో అత్యుత్తమ బ్యాటింగ్‌ ప్రదర్శించిన ఎఎంబిఐ స్వప్నిల్‌ కుమార్‌ రెడ్డికి ఉత్తమ బ్యాట్స్మెన్‌ గా, హోంగార్డు ఆదినారాయణ ఉత్తమ బౌలర్‌గా నిలిచారు. మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ గా నెల్లూరు ఉప రవాణా కార్యాలయ సీనియర్‌ అసిస్టెంట్‌ కష్ణయ్య మెమెంటోస్‌ అందుకున్నారు. అందరిలో క్రీడా స్ఫూర్తి నిలిపి మానసిక ఒత్తిడి అధిగమించేలా నిరంతర ప్రక్రియకు భిన్నంగా ఈ క్రీడా పోటీలో సిబ్బంది ప్రోత్సహించినందుకు ఉప రవాణా కమిషనర్‌ శ్రీ చందర్‌ను సిబ్బంది ప్రశంసించారు.