Nov 28,2022 23:29

విజయం సాధించిన హెచ్‌పిసిఎల్‌ క్రికెట్‌ జట్టు

ప్రజాశక్తి - ములగాడ : హెచ్‌పిసిఎల్‌ ఆల్‌ ఇండియా ఇంటర్‌ యూనిట్‌ క్రికెట్‌ టోర్నీలో కెప్టెన్‌ పి.వెంకటపతి రాజు నేతృత్వంలోని విశాఖ రిఫైనరీ జట్టు చాంఫియన్‌గా నిలిచింది. ముంబైలో ఈనెల 24 నుంచి 26వరకు నిర్వహించిన టోర్నీలో 12జట్లు పాల్గొనగా, ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించిన విశాఖ రిఫైనరీ జట్టు, ఫైనల్‌లో నార్త్‌జోన్‌ జట్టుపై 31పరుగుల తేడాతో విజయం సాధించి విజేతగా నిలిచింది. విజేత విశాఖ రిఫైనరీ జట్టు ఫైనాన్స్‌, హెచ్‌ఆర్‌ డైరెక్టర్‌ రజనీష్‌ నారంగ్‌ నుంచి ట్రోఫీని అందుకున్నారు. విజేత విశాఖ జట్టును ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఇన్చార్జ్‌ వి.రతన్‌రాజ్‌ అభినందించారు. టీమ్‌ మేనేజర్‌ మిస్టర్‌ జాన్‌ చెరియన్‌, మేనేజర్‌ హెచ్‌ఆర్‌, ఛాంపియన్‌ టీమ్‌ సభ్యులు ఎస్‌. రాజశేఖర్‌, బిఎస్‌ రాఘవేంద్ర, ఇఆర్‌ఎమ్‌ రెడ్డి, వివేక్‌ సింగ్‌ (ఉత్తమ బ్యాట్స్‌మెన్‌), పి మోహన్‌ కుమార్‌ (ఉత్తమ బౌలర్‌ మరియు మ్యాన్‌ ఆఫ్‌ ది ఫైనల్స్‌), అభిషేక్‌ ఎస్‌. నిరంజన్‌, ఎం.కే చౌహాన్‌, ఎన్‌. భద్ర, పీ .వి సంజరు కుమార్‌, కే. సుధీర్‌ రాజ్‌, ఎం.ఎఫ్‌ హఫ్నాస్‌, వై. హేమంత్‌, ఎస్‌. హరి, పి.వెంకట కుమార్‌లను హెచ్‌పిసిఎల్‌ సిజిఎం (హెచ్‌ఆర్‌) వి.నగేష్‌ అభినందించారు.