Sep 12,2023 21:43

ఫొటో : కప్‌ అందుకున్న విజేత జట్టు

క్రికెట్‌ టోర్నమెంట్‌ విజేతలకు బహుమతులు
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : ఆత్మకూరు లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో పట్టణంలో ఫ్రెండ్స్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ వారి నిర్వహణలో నాలుగు రోజులపాటు జరిగిన క్రికెట్‌ టోర్నమెంట్‌ విజేతులకు, రన్నర్స్‌కు మంగళవారం లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో బహుమతుల ప్రదానం నిర్వహించారు. పట్టణంలోని ఎస్‌ఆర్‌జె డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో ఫ్రెండ్స్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ నాలుగు రోజులపాటు నిర్వహించిన ఈ టోర్నమెంట్‌లో డిగ్రీ, ఇంటర్మీడియట్‌, పదవ తరగతి విభాగాలలో గెలిచిన విజేతలకు, రన్నర్స్‌కు ఆత్మకూరు లయన్స్‌ క్లబ్‌ నిర్వాహకులు ప్రెసిడెంట్‌ మెంటా వెంకటేశ్వర్లు, సెక్రటరీ సంతోష్‌ కుమార్‌, ట్రెజరర్‌ సోమిశెట్టి కిరణ్‌ కుమార్‌ బహుమతులుగా మెడల్స్‌, అందించారు. ఈ టోర్నమెంట్లో విజేతలుగా డిగ్రీ విభాగంలో ఎఎస్‌ఆర్‌ కాలేజీ విద్యార్థులు, ఇంటర్మీడియట్‌ విభాగంలో బిఎస్‌ఆర్‌ కాలేజీ విద్యార్థులు, పదో తరగతి విభాగంలో సెయింట్‌మేరీస్‌ స్కూల్‌ విద్యార్థులు గెలుపొందగా వారికి బహుమతులు అందజేశారు.
మేధా స్కూల్‌, బిఎస్‌ఆర్‌ కాలేజ్‌, ఆంధ్ర ఇంజనీరింగ్‌ కాలేజ్‌ విద్యార్థులు రన్నర్స్‌గా నిలిచారు. నాలుగు రోజులపాటు క్రికెట్‌తో పాల్గొన్న టీం సభ్యులందరికీ కావాల్సిన వసతులను లైన్స్‌ క్లబ్‌ ఆత్మకు నిర్వాహకులు అందజేశారు. ఈ బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమంలో సెయింట్‌ మేరీస్‌ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఝాన్సీ రాణి, సిస్టర్‌ జెన్నీఫర్‌, లైన్స్‌ క్లబ్‌ నిర్వాహకులు, విద్యార్థులు పాల్గొన్నారు.