ప్రజాశక్తి -యంత్రాంగం
తగరపువలస : భీమిలి మండలం తాళ్ళవలసలో క్రికెట్ టోర్నమెంట్ శనివారం ప్రారంభమైంది. టోర్నమెంట్‌ను నియోజకవర్గ వైసిపి ఇంఛార్జి ముత్తంశెట్టి మహేష్ ప్రారంభించారు. జివిఎంసి వలందపేట ఎస్‌కెఎంఎల్- ఆనందపురం మండలం బొడ్డపాలెం జట్ల మధ్య తొలి మ్యాచ్ జరిగింది. ఇరు జట్ల క్రీడాకారులను పరిచయం చేసుకున్న అనంతరం బ్యాటింగ్ చేసి టోర్న మెంట్‌ను మహేష్ ప్రారంభించారు. నియోజకవర్గంలోని 64 జట్లు పాల్గోనున్నట్లు టోర్నమెంట్ నిర్వాహకులు చిల్ల హరి తెలిపారు. బోయి సూరిబాబు జ్ఞాపకార్థం అతని కుమారుడు వెంకటరావు క్రీడాకారులకు జెర్సీలు అందజేశారు. మాజీ సైనికులు బోయి అప్పలరెడ్డి షీల్డ్‌లు అందజేశారు. ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 12వ తేదీ వరకు టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎఎంసి చైర్మన్ యలమంచిలి సూర్య నారాయణ, వైసిపి పంచాయతీ అధ్యక్షులు అక్కరమాని అప్పలనాయుడు, పార్టీ మండల యూత్ ప్రెసిడెంట్ చిల్ల హరి, ఉప సర్పంచ్ బుద్ధరాజు సత్యనారాయణరాజు, నాయకులు వై గోవింద, వేణురాజు తదితరులు పాల్గొన్నారు.
క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం
ప్రజాశక్తి -ములగాడ : ఇండిస్టీ కాలనీ యూత్ ఆధ్వర్యాన కాలనీ మైదానంలో ఇండిస్టీ కాలనీ యూత్ క్రికెట్ టోర్నమెంట్‌ను శనివారం వార్డు కార్పొరేటర్ కొణతాల సుధ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువత క్రీడల్లో రాణించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 61వ వార్డు వైసిపి వార్డు ఇన్‌ఛార్జి దాడి సత్యనారాయణ, నాయకులు కొల్లి నూకరెడ్డి, బుస అప్పలరెడ్డి తదితరులు పాల్గొన్నారు.










