Dec 31,2022 23:38

క్రికెట్‌ పోటీలను ప్రారంభిస్తున్న ఎంపిపి శ్రీదేవి

ప్రజాశక్తి - రంపచోడవరం
మండలం వేములకొండ పంచాయతీ వెట్టిచెలకల యూత్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంక్రాంతి క్రికెట్‌ టోర్నమెంట్‌ను శనివారం ఎంపీపీ బంధం శ్రీదేవి ప్రారంభించారు. ఇందులో 18 జట్లు పాల్గొంటున్నాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరు క్రీడా స్ఫూర్తితో ఆడాలన్నారు. ఆటల ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చని తెలిపారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా అసాంఘిక కార్యక్రమాల జోలికి పోకుండా ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహించడంపై గ్రామ యూత్‌ని అభినందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ కొమరం పండు దొర, ఎంపీటీసీలు తుర్రం వెంకటేశ్వర్లు, వంశి కుంజం, తున్నూరు సర్పంచ్‌ భాస్కర్‌, మండల విద్యాశాఖాధికారి శ్రీకారం సత్యనారాయణ దొర, వైసిపి నాయకులు, కార్యకర్తలు, టోర్నమెంట్‌ నిర్వాహకులు పాల్గొన్నారు.