Jan 18,2023 23:01

విజేతలకు బహుమతులు అందజేస్తున్న కార్పొరేటర్‌ హేమలత

ప్రజాశక్తి-ఆనందపురం: మండలంలోని కల్లివానిపాలెంలో కెవిపి గణేష్‌ యూత్‌ ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్బంగా నిర్వహించిన క్రికెట్‌ టోర్నీ విజేతగా పాలవలస జట్టు నిలిచింది. 50 జట్లు పాల్గొన్న ఈ టోర్నీ ఫైనల్‌లో లొడగలవానిపాలెం జట్టుపై పాలవలస జట్టు విజయం సాధించింది. విజేత పాలవలసతోపాటు రన్నరప్‌ లొడగలవానిపాలెం జట్లకు ఆనందపురం మండల ఉపాధ్యక్షులు బొట్ట ధనలక్ష్మి రామకృష్ణ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ వానపల్లి లక్ష్మి ముత్యాలరావు మాజీ సర్పంచ్‌ బోయి రమణ మాజీ ఎంపిటిసిలు సూరిబాబు, రౌతు వెంకటరావు, లోడగల వెంకటరావు, ఉప సర్పంచ్‌ బొట్ట శ్రీను, వార్డు సభ్యుడు పైడిరెడ్డి, యూత్‌ ప్రెసిడెంట్‌ పిల్లి రెడ్డి, వెంకటేష్‌ శివ రాజేష్‌, గ్రామపెద్దలు రాంబాబు, పాపారావు, రామారావు, కె.అప్పల గురువులు, దుక్కవానిపాలెం పెద్దలు బంక రమేష్‌, వర్షం వెంకట్‌, ఉప్పాడ రామిరెడ్డి, విఆర్‌పి రెడ్డి, బెండ సూరి, కాశీ విశ్వనాధం, కేవీపీ గణేష్‌ యూత్‌ పాల్గొన్నారు
మధురవాడ : బొట్టవానిపాలెం శివారులో కీర్తిశేషులు కొర్రాయి గోవింద్‌, నమ్మి అప్పలరాజు జ్ఞాపకార్థం నిర్వహించిన బొట్టవానిపాలెం ప్రీమియర్‌ లీగ్‌-2023 పోటీలు ముగిసాయి. ఐదు జట్లు పాల్గొన్న టోర్నీలో బివిపి బుల్స్‌ జట్టు విజేతగా నిలవగా, బివిపి రాయల్‌ స్ట్రయికర్స్‌ జట్లు రన్నరప్‌గా నిలిచింది. విజేతలకు ఐదవ వార్డు కార్పొరేటర్‌ మొల్లి హేమలత, టిడిపి రాష్ట్ర కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో గ్రామపెద్దలు నమ్మి నరసింహులు, నమ్మి సూర్య అప్పారావు, నమ్మి శ్రీను, కొర్రాయి మంగరాజు, కొర్రాయి అప్పలస్వామి, కనకదుర్గ సప్లయర్స్‌ ఈవెంట్స్‌ కొర్రాయి సురేష్‌, నమ్మి రమణ పాల్గొన్నారు.