
ప్రజాశక్తి -యంత్రాంగం
గాజువాక : సైన్ ఇన్ బ్లూ ఆర్గనైజేషన్ ఆధ్వర్యాన సమతానగర్‌లో ఏర్పాటుచేసిన క్రికెట్ పోటీలను గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీన గాజువాక నియోజవర్గ వైసిపి ఇన్చార్జి తిప్పల దేవన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా సైన్ ఇన్ బ్లూ ఆర్గనైజేషన్ ఆధ్వర్యాన ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హైకోర్టు న్యాయవాది అండిబోయిన లక్ష్మి మాట్లాడుతూ, ఈ పోటీల్లో 40 జట్లు పాల్గొంటాయని చెప్పారు. విజేతలకు మొదటి బహుమతిగా రూ.20 వేలు, రెండో బహుమతిగా రూ.12 వేలు, మూడో బహుమతిగా రూ.8 వేలు, షీల్డు ఈ నెల 25వ తేదీన బహూకరించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ క్రీడాకారుడు అండిబోయిన అప్పారావు, రజక కార్పొరేషన్ డైరెక్టర్ ఈగలపాటి యువశ్రీ, గంగులూరి రోజారాణి, గొందేసి ప్రభాకర్‌రెడ్డి, జెర్రిపోతుల గోవింద గౌడ్, కుప్పిలి ప్రసాద్, చీరపు శంకర్, ఫణికుమార్, కమిటీ సభ్యులు భార్గవ్, అనీల్, నరేష్, మనోజ్, అశోక్, ఉదరు, నవీన్, సాయి, అరవింద్ పాల్గొన్నారు.
తగరపువలస : చిట్టివలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో హెచ్‌సిఎల్ క్రికెట్ టోర్నమెంట్‌ను వెంపాద వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు వెంపాడ శ్రీనివాసరెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్రీడలు శారీరక దారుఢ్యానికి, మానిసికోల్లాసానికి దోహద పడతాయన్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులు తిరుపతిరావు, క్రీడాకారులు ప్రతాప్, శాంతి, లోవరాజు, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.