Sep 06,2023 21:50

ఫొటో : క్రికెట్‌ పోటీలను ప్రారంభిస్తున్న సర్పంచ్‌ ఇండ్ల సుధాకర్‌

క్రికెట్‌ పోటీలు ప్రారంభం
ప్రజాశక్తి-జలదంకి : వంటేరు వరదారెడ్డి చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో మాజీ ఎంఎల్‌ఎ వంటేరు వేణుగోపాల్‌ రెడ్డి ఆర్థిక సహాయంతో బ్రాహ్మణక్రాక పంచాయతీలోని బికె అగ్రహారం గ్రామంలో నిర్వహిస్తున్న జిల్లాస్థాయి క్రికెట్‌ టోర్నమెంట్‌ను బుధవారం సర్పంచ్‌ ఇండ్ల సుధాకర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా సుధాకర్‌ మాట్లాడుతూ క్రీడలు శారీరక, మానసిక ఉల్లాసానికి దోహదమని, క్రీడలతో యువతకు మానసిక వికాసం కలుగుతుందన్నారు. క్రీడా పోటీల్లో పాల్గొనడం వల్ల స్నేహభావం పెంపొందుతుందని తెలిపారు.
అంతేకాకుండా ప్రతి క్రీడాకారుడు క్రీడా స్ఫూర్తితో ఆడి, గెలుపోటములను సమానంగా స్వీకరించాలని సూచించారు. జిల్లా స్థాయిలో 30 టీములు పాల్గొనే ఈ టోర్నమెంట్లో మొదటి బహుమతిగా రూ.20వేలను, ద్వితీయ బహుమతిగా రూ.15వేలను తృతీయ బహుమతిగా రూ.10వేలను మాజీ ఎంఎల్‌ఎ వంటేరు వేణుగోపాల్‌ రెడ్డి అందజేస్తారని తెలిపారు. ఈ క్రికెట్‌ టోర్నమెంట్‌కు ఆర్గనేజర్‌లుగా వల్లెపు చందు, బండారు విష్ణువర్ధన్‌ రెడ్డి నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో వల్లెపు ఏడుకొండలు, బండారు తిరపతిరెడ్డి, వేలమూరి వెంకటేశ్వర రెడ్డి, గంగపట్ల మాలకొండయ్య, దేవరపల్లి మాల్యాద్రిరెడ్డి, మదన్‌ మోహన్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.