Apr 06,2023 00:46

ఎంపీపీ బి.ఈశ్వరి

ప్రజాశక్తి-డుంబ్రిగూడ: గిరి యువత క్రీడల్లో రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఎంపీపీ బి.ఈశ్వరి చెప్పారు. మండలంలోని సొవ్వ పంచాయతీలో బుధవారం ఎంపీపీ ఈశ్వరి క్రికెట్‌ టోర్నమెంటును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, క్రీడలు శారీరత ధృడత్వంతో పాటు మానసిక ఉల్లాసానికి ఎంతో దోహద పడతాయన్నారు. క్రీడల్లో యువతకు ప్రోత్సాహించేం దుకు ఈ టోర్నమెంట్లు నిర్వహిస్తున్నట్లు ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ ఎస్‌ ఆనంద్‌, వైసిపి మండల అధ్యక్షుడు ఎస్‌.గోపాల్‌, ఆ పార్టీ నాయకులు బి.సింహాచలం, ఎస్‌.జగ్గు నాయుడు, అశోక్‌, రాంప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.