Feb 18,2023 21:58

ప్రజాశక్తి - భీమడోలు
              ఆటల పోటీలు కార్మికుల్లో ఉత్సాహాన్ని పెంచుతాయని, గెలుపోటములకు అతీతంగా వారి మధ్య స్నేహ బంధాలు పెరిగేందుకు దోహదపడతాయని సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్‌.లింగరాజు అన్నారు. స్థానిక జిల్లా పరిషత్‌ హైస్కూలు వేదికగా అంబర్‌పేట కేంద్రంగా పనిచేస్తున్న లిక్సిల్‌ ఇండియా కంపెనీ రెండు రోజులపాటు కార్మికులకు లిక్సిల్‌ ప్రీమియర్‌ లీగ్‌ పేర క్రికెట్‌ పోటీలను నిర్వహిస్తుంది. శనివారం ఈ పోటీలు ప్రారంభమయ్యాయి. ప్రారంభ కార్యక్రమంలో లింగరాజుతో పాటు వైసిపి జిల్లా నాయకులు తుమ్మగుంట రంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా లిక్సిల్‌ కంపెనీ, మానవ వనరుల విభాగం హెడ్‌ లోకేష్‌ తమ సంస్థ ద్వారా చేపట్టిన కార్మికులకు క్రికెట్‌ పోటీల నిర్వహణ, ఇతర అంశాలను అతిథులకు వివరించారు. దీనిలో భాగంగా క్రికెట్‌ పోటీల్లో కంపెనీకి చెందిన కార్మికులు ఎనిమిది జట్లుగా పాల్గొంటున్నారని తెలిపారు. అనంతరం క్రీడాకారులను లింగరాజు పరిచయం చేసుకున్నారు.