Apr 26,2023 16:32

క్రికెట్‌ కిట్లను పంపిణీ చేస్తున్న బీసీ ఇందిరా


క్రికెట్‌ కిట్లు పంపిణీ
ప్రజాశక్తి - బనగానపల్లె

     పట్టణంలోని కొండపేట, ఈద్గా నగర్‌, రంగరాజుపేట, లాల్‌ మసీదు కాలనీ, అవుకు మెట్ట దగ్గర ఉన్న సైదు పేటకు చెందిన యువతకు మాజీ ఎమ్మెల్యే బిసి జనార్దన్‌ రెడ్డి సతీమణి, థారు బాక్సింగ్‌ రాష్ట్ర చైర్మన్‌ బిసి ఇందిరా క్రికెట్‌ కిట్లను బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువత చదువుతోపాటు క్రీడల్లో రాణించాలన్నారు. వేసవి కాలంలో యువకులు క్రీడలపై దృష్టి సారించేందుకు క్రికెట్‌ కిట్లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.