ఫొటో : క్రికెట్ కిట్‌ను అందజేస్తున్న డాక్టర్ కెవి శ్రావణ్‌కుమార్
క్రికెట్ కిట్ అందజేత
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్ : ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని 20వ వార్డుకు చెందిన యువతకు మున్సిపల్ వైస్ చైర్మన్, అభిరామ్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ కెవి శ్రావణ్‌కుమార్ చిన్న కుమారుడు అభిరామ్ చేతులు మీదుగా ఆదివారం యువతకు క్రికెట్ కిట్‌ను అందజేశారు. గతంలో వార్డు పరిధిలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం సందర్భంగా యువత క్రికెట్ కిట్ కావాలని డాక్టర్ శ్రావణ్‌ను కోరడంతో ఆయన స్వంత నిధులతో క్రికెట్ కిట్‌ను తెప్పించి వైసిపి వార్డు ఇన్‌ఛార్జి ప్రసాద్‌తో కలసి వారికి అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ యువతను క్రీడలపై ప్రోత్సహించే లక్ష్యంగా ఈ క్రీడాసామగ్రిని అందజేస్తున్నట్లు తెలిపారు.










