గత కేసులు నమోదైన వారికి కౌన్సెలింగ్
ప్రజాశక్తి - ఏలూరు స్పోర్ట్స్
ప్రపంచ కప్ క్రికెట్ పోటీల నిర్వహణ నేపథ్యంలో క్రికెట్ బెట్టింగ్లు నివారించేందుకు ఎస్‌పి మేరీ ప్రశాంతి ఆదేశాల మేరకు పోలీసు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు ఏలూరు నగరంలోని త్రీటౌన్, టూటౌన్ పోలీస్ స్టేషన్ల వద్ద గతంలో క్రికెట్ బుకీలు నిర్వహించి, కేసులు నమోదైన వారు, క్రికెట్ బెట్టింగ్‌లో పట్టుబడిన వారిని మంగళవారం పోలీస్ స్టేషన్లకు పిలిపించి త్రీటౌన్ సిఐ కోమాకుల శివాజీ, టూటౌన్ సిఐ చంద్రశేఖర్ తమ పోలీసు స్టేషన్ల వద్ద వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం ఏలూరు తహశీల్దార్ సోమశేఖర్ ముందు హాజరు పరిచి, వారిపై బైండోవరు కేసులు నమోదు చేయించారు.










