ప్రజాశక్తి-కర్లపాలెం: గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలు ఎక్కువగా ఆడటం వలన యువతలో పోరాట స్ఫూర్తి పెరుగుతుందని వైసీపీ నాయకు లు మార్పు బెనర్జీ అన్నారు. కర్లపాలెం మండలం నర్రావారి పాలెం గ్రామంలో నిర్వహించిన కోన ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ గురువారం ఘనంగా ముగిసింది. మొత్తం 30 జట్లు పాల్గొన్న ఈ టోర్నమెంటులో ఫైనల్‌లో మార్పు చెన్నయ్య గారి పాలెం - నర్రవారిపాలెం జట్లు తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన నర్రవారిపాలెం జట్టు నిర్ణీత 12 ఓవర్లకు 84 పరుగులు సాధించింది. 85 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన మార్పు చెన్నయ్య గారి పాలెం జట్టు 10 ఓవర్లకు 85 పరుగులను ఛేదించింది. ఈ టోర్నమెంట్లో మూడో బహుమతిని దాస్ నగర్ టీం కైవసం చేసుకుంది. ఈ టోర్నమెంట్‌కు మొదటి బహుమతిగా రూ.15,000 ప్రముఖ వ్యాపారవేత్త గుండ్రెడ్డి శివ అందజేశారు. రెండో బహుమతిని వైసిపి నాయకులు మార్పు బెనర్జీ, మూడో బహుమతిని మండల యూత్ కన్వీనర్ యల్లావుల ఏడుకొండలు అందజేశారు. అలాగే నర్రా వెంకట సుబ్బారావు, నర్రా గోపి, మరక రాజు, మల్లారపు గోపి, నర్రా నాగరాజు, అక్కల దుర్గా రెడ్డి, నంగు మణికంఠ రెడ్డి, నంగు రాజేష్ రెడ్డి వ్యక్తిగత బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా విజేతలకు యల్లావుల ఏడుకొండలు, మార్పు బెనర్జీ, మార్పు రత్నం బహుమతులు అందజేశారు.










