Dec 18,2022 23:45

క్రీడాకారులతో మాట్లాడుతున్న ఎస్సై

ప్రజాశక్తి-నర్సీపట్నం టౌన్‌:యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్రం, శ్రీ వేమ ఎన్జీవో (వేములపూడి) ఆధ్వర్యంలో పట్టణంలో బ్లాక్‌ లెవెల్‌ స్పోర్ట్స్‌ స్థానిక ఎస్సై ధనుంజరాయుడు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ, క్రీడలతో యువతకు మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయని, ప్రతి ఒక్కరూ హార్డ్‌ వర్క్‌ను నమ్ముకోవాలని తెలిపారు. శ్రీ వేమ ఎన్జీవో సెక్రటరీ బొలెం శివ మాట్లాడుతూ, ఈ పోటీలు మూడు రోజులపాటు జరుగుతాయని, వీటిలో కబడ్డీ, కోకో,వాలీబాల్‌, రన్నింగ్‌, షాట్‌ పుట్‌, క్యారం బోర్డ్‌, చెస్‌ వంటి క్రీడలు నిర్వహిస్తున్నామని తెలిపారు.ఈ పోటీలో పాల్గొన్న వారికి కేంద్ర ప్రభుత్వ సర్టిఫికెట్లు అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయి రూరల్‌ డెవలప్మెంట్‌ సొసైటీ సెక్రటరీ సాయి, వెలగ జగన్నాథ్‌, మాకిరెడ్డి రవి, శ్రీను, డిడియు జీవీకే సిబ్బంది లక్ష్మీనారాయణ, హరి ,తదితరులు పాల్గొన్నారు.