Oct 14,2022 22:44

కరాటే ట్రోఫీని ఆవిష్కరిస్తున్న వెంకటరెడ్డి, మేయర్‌

ప్రజాశక్తి-సీతమ్మధార : క్రీడల్లో రాణించడం ద్వారా ఉన్నత శిఖరాలకు ఎదగవచ్చని ఎపి మారిటైమ్‌ బోర్డు చైర్మన్‌ కాయల వెంకటరెడ్డి, నగర మేయర్‌ గొలగాని హరి వెంకటకుమారి అన్నారు. శుక్రవారం స్వర్ణభారతి స్టేడియంలో కెవిఆర్‌ ఎస్టేట్స్‌ ఆధ్వర్యంలో నిర్వహించే ఆల్‌ ఇండియా ఓపెన్‌ కరాటే ఛాంపియన్‌షిప్‌ ట్రోఫీని ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి క్రీడలకు ఎంతో ప్రాధాన్యతనిస్తున్నారన్నారు. క్రీడలతో ఆరోగ్యంతోపాటు జిల్లా, రాష్ట్ర,జాతీయ, అంతర్జాతీ స్థాయి పోటీల్లో రాణిస్తే వారి భవిష్యత్‌ బంగారుమయం అవుతుందన్నారు. ఈపోటీల్లో తొమ్మిది రాష్ట్రాల నుంచి క్రీడాకారులు పాల్గొనడం సంతోషకరమన్నారు. పోటీల నిర్వాహకులను అభినందించారు. కార్యక్రమంలో కెవిఆర్‌ ఎస్టేట్స్‌ గ్రూప్‌ మేనేజర్‌ కాయల సూరారెడ్డి క్రీడాకారులు, తల్లిదండ్రులు, ఆర్గనైజింగ్‌ కమిటీ సభ్యులు, కోచ్‌లు పాల్గొన్నారు