ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్ : క్రీడలతో ఉజ్వల భవిష్యత్ లభిస్తుందని సర్పంచ్‌ల సంఘం అధ్యక్షులు గొండు శంకర్ తెలిపారు. మండలంలోని సానివాడలో జిల్లా బాల్‌బ్యాడ్మింటన్ సంఘం ఆధ్వర్యాన ఆధ్వర్యాన జిల్లాస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలు, రాష్ట్రస్థాయి జట్టు ఎంపికలను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడలతో శారీరిక మానసిక ఆరోగ్యం లభిస్తుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో జిల్లాస్థాయి పోటీలు నిర్వహించడం ద్వారా నైపుణ్యమైన క్రీడాకారులు, మట్టిలో మాణిక్యాలు వెలుగులోకి వస్తారని అన్నారు. విద్యార్థుల తమ విలువైన సమయాన్ని వృథా చేయకుండా, అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీల్లో రాణించి తమ తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, దేశానికి కీర్తి ప్రతిష్ట తీసుకురావాలని ఆకాంక్షించారు. జిల్లా బాల్ బ్యాడ్మింటన్ ప్రధాన కార్యదర్శి పి.వి.జి.మురళీకృష్ణంరాజు మాట్లాడుతూ జిల్లాలో బాల్ బ్యాడ్మింటన్‌కు త్వరలోనే పునర్ వైభవం తీసుకొస్తామని తెలిపారు. సీనియర్ క్రీడాకారుల విజయ పరంపరమైన కొనసాగించాలని కోరారు. కార్యక్రమంలో ఒలంపిక్ అసోసియేషన్ సలహాదారులు పెంకి సుందర రావు, వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఎం.వి. రమణ, ఎం.సాంబమూర్తి, ఎస్‌జిఎఫ్ సెక్రటరీ బి.వి.రమణ, సానివాడ సర్పంచ్ రుప్ప లక్ష్మి, గ్రామీణ మండలం బాల్ బ్యాడ్మింటన్ సంఘం అధ్య క్షులు రుప్ప రమణమూర్తి, జిల్లా సంఘ ప్రతినిధులు పి.అజరు కుమార్, అరుణ్‌కుమార్, ఎం.మధుసూదనరావు, రాజ్‌కుమార్ పాల్గొన్నారు.










