Oct 14,2023 00:06

ప్రజశక్తి - చీరాల 
క్రీడలు యువత ఆరోగ్యానికి, శరీర దృఢత్వానికి ఎంతో ఉపయోగపడతాయని వైసిపి ఇన్చార్జి కరణం వెంకటేష్ బాబు అన్నారు. స్థానిక ఎన్ఆర్ అండ్ పిఎం హై స్కూల్‌లో ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి పుట్ బాల్ టోర్నమెంట్ చీరాల ఫుడ్ బాల్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు. ఈ ఆటలు 15వరకు జరుగ నున్నాయి. కౌన్సిలర్ గొట్టిపాటి ఎబినేజర్ పర్యవేక్షణలో జరిగిన క్రీడా పోటీలకు ఆయన హాజరయ్యారు. క్రీడాలలో గెలుపు ఓటమిలు ముఖ్యం కాదని అన్నారు. ఆటలు ఐక్యతను పెంచుతాయని అన్నారు. గొట్టిపాటి భాగ్యరాజు, కంకణాల టామ్ ఆర్గనైజ్‌ చేశారు. 12టీంలు పాల్గొనగా మొదటి బహుమతి రు.50వేలు, 2వ బహుమతి రు.30వేలు, 3వ బహుమతి రు.20వేలు విజేతలకు ఇవ్వనున్నట్లు తెలిపారు.  కార్యక్రమంలో డాక్టర్ సిల్వన్ రాజ్, మునిసిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, నెస్సి, యాతం మేరీబాబు, కోడూరి ప్రసాదరెడ్డి, డొక్కా ప్రవీణ్ పాల్గొన్నారు.