అనంతపురం : క్రీడలు మానసికోల్లాసానిక దోహదం చేస్తాయని, ప్రతి ఒక్కరూ విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలని జెఎన్‌టియు విసి జింక రంగజనార్ధన తెలిపారు. బుధవారం స్థానిక ఒటిపిఆర్‌ఐ కళాశాలలో క్రీడా సంబరాలను ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు క్రీడలు ఎంతో దోహదం చేస్తాయని చెప్పారు. విద్యాతో పాటు క్రీడలను భాగస్వామ్యం చేసుకోవాలన్నారు. ఉద్యోగాల ఎంపికలో క్రీడల్లో రాణించిన విద్యార్థులకు ప్రత్యేక కోటా ఉంటుందన్నారు. అనంతపురం ఒటిపిఆర్‌ఐ కళాశాల అభివద్ధికి జెఎన్‌టియు నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. అంతకుముందు క్రీడాకారుల చేత ఉపకులపతి గౌరవ వందన స్వీకరించి, శాంతి కపోతాలను ఎగురవేశారు. విద్యార్థులతో కలిసి క్రికెట్ ఆడి ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ శశిధర్, ఒటిపిఆర్‌ఐ డైరెక్టర్ దుర్గాప్రసాద్, ప్రిన్సిపల్ గోపీనాథ్, వర్సిటీ పిఆర్‌ఒ డాక్టర్ రామ శేఖర్ రెడ్డి, అసిస్టెంట్ రిజిస్ట్రార్ ప్రభాకర్‌తో పాటు బోధనబోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.