Jun 12,2023 00:44

క్రీడాకారులను పరిచయం చేసుకుంటున్న కృష్ణకిషోర్‌

ప్రజాశక్తి- రేపల్లె : క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ఉద్యోగ అవ కాశాల్లో మంచి స్థానం ఉంటుందని రేపల్లె అరే మండల సచివాలయ కన్వీనర్‌ కాకితల కృకిషోర్‌ తెలిపారు. మండల పరిధిలోని పిరాటలంక గ్రామంలో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణారావు సహకారంతో గ్రామ వైసిపి అధ్యక్షుడు తోట రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి క్రికెట్‌ పోటీలను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కృష్ణ కిశోర్‌ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తితో ఆటలు ఆడాలన్నారు. గెలుపోటములు సహజమని, ఈ విషయాన్ని ప్రతి క్రీడాకారుడు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వైసిపి గ్రామ కన్వీనర్‌ తోట రాంబాబు మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణారావు సహకారంతో గ్రామంలో అనేక అభివద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఆదేవిధంగా కుల, మత, పార్టీలకతీతంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు వేసవి సమ యంలో క్రీడాకారులను ప్రోత్స హించాలని దఢ సంకల్పంతో రాష్ట్రస్థాయిలో క్రికెట్‌ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వడ్డీ వారిపాలెం గ్రామ సర్పంచి వడ్డీ సునీత శ్రీనివాసరావు, మోర్తోట గ్రామ సర్పంచి కారాని కృష్ణ కుమారి శ్రీనివాసరావు, పిరాటలంక వైసిపి నాయకులు గొట్టిపాటి దేవర్ధన రావు, చాట్రాగడ్డ మోహన్‌రావు, గొట్టిపాటి శివాజీ, కనపర్తి వీరాస్వామి, నీలా రవికుమార్‌, గ్రామ పెద్దలు, నాయకులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.