ప్రజాశక్తి - సీతంపేట : వ్యాయామం, క్రీడలతో విద్యార్థులకు మానసిక ఉల్లాసన ఉంటుందని ఐటిడిఎ స్పోర్ట్స్ ఇన్‌ఛార్జ్ ఎన్.జాకబ్ దయానంద్ పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక గిరిజన బాలుర గురుకుల కళాశాలలో స్పోర్ట్స్ గేమ్స్ వ్యాయామం గురించి అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాల పక్కనే ఉన్న గ్రీన్‌ఫీల్డ్ స్టేడియంను విద్యార్థులు ఉపయోగించుకొని క్రీడల్లో జాతీయ స్థాయికి రాణించాలని ఇలాంటి స్టేడియం మీకు దగ్గరలో ఉండడం గొప్ప విషయమని దీని వినియోగించుకోవాలని కోరారు. బాస్కెట్బాల్, వాలీబాల్, బాల్‌బ్యాడ్మింటెన్, ఖోఖో తదితర ఆటలపై తర్ఫీదు కూడా ఇస్తున్నామని తెలిపారు. దీంతో పాటు వ్యాయామం ఎంతో అవసరమని తెలిపారు. కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపల్ నాగభూషణరావు, పిడి లక్ష్మణ మూర్తి తదితరులు పాల్గొన్నారు.










