ప్రజాశక్తి-ఈపూరు : క్రీడల్లో రాణించడం ద్వారా సమాజంలో మంచి గుర్తింపు పొందొచ్చని జెడ్‌పిటిసి తుర్లపాటి చౌడయ్య అన్నారు. మండల కేంద్రమైన ఈపూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మండల స్థాయి ఆటల పోటీలను రెండ్రోజుల పాటు నిర్వహించనున్నారు. పోటీలను బుధవారం ప్రారంభించిన జెడ్‌పిటిసి మాట్లాడుతూ చదువుతోపాటు క్రీడల్లో ప్రతిభ కనబరిచిన వారికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. చేసే ప్రతి పనిలో లక్ష్యాలను నిర్ధేశించుకొని కృషి చేస్తే సత్ఫలితాలు వస్తాయని చెప్పారు. హెచ్‌ఎం ఎన్.రామకృష్ణారెడ్డి మాట్లా డుతూ గెలుపోటములు సహజమని, విద్యార్థులు ఐకమత్యంతో మెలిగి క్రీడా స్ఫూర్తితో ఆడాలని చెప్పారు. క్రీడా దుస్తులు ఉచితంగా అందజేసిన ఉపాధ్యా యులు డి.సుబ్రహ్మణ్య ప్రసాద్, వి.అనురాధ, ఏపీఈఈ యూనియన్ సభ్యులు, అంగలూరు సొసైటీ సిబ్బంది జి.శేఖర్ ను అభినందించారు. కార్యక్ర మంలో పిఇటిలు ఎ.వీరాంజనేయులు, ఎం.వెంకటేశ్వర్లు, వై.చిరంజీవి, ఎస్.రూత్ మేరీ, గోపి, ఝాన్సీ పాల్గొన్నారు.










