Oct 13,2023 00:52

ప్రజాశక్తి - చీరాల
విద్యార్థులు చదువుతోపాటు ఆటల్లోనూ రాణించాలని వైసిపి ఇన్చార్జి కరణం వెంకటేష్ బాబు కోరారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా స్థాయిలో సంతనూతలపాడు జడ్పీ పాఠశాలలో జరిగిన అండర్ 14, 17 బాల, బాలికల పోటీల్లో రాష్ట్రస్థాయికి ఎంపికైన వాడరేవు జెడ్పి హై స్కూల్ విద్యార్థులను ఆయన అభినందించారు. అండర్ 17బాలుర విభాగంలో ఎం సోమేశ్ చింత శామ్యూల్, 14 విభాగంలో పారా రాజేష్, కొవ్వూరి నూకరాజు, ఎ మహేష్, బాలికల విభాగంలో దిక్కి రత్నదీపిక, సంజుల ఎర్రంశెట్టి, చింతా మేరీ కీర్తన ఎంపిక అయ్యారు. ఉత్తమ శిక్షణ ఇచ్చి రాష్ట్రస్థాయిలో ఎంపికయ్యేలా కృషిచేసిన పిఇటి నాశన రవీంద్రబాబును, పాఠశాల హెచ్ఎం పి రాధారాణి, ఉపాధ్యాయులను అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల అధ్యాపకులు పలువురు పాల్గొన్నారు.