Jan 07,2023 22:58

బెస్ట్‌ క్రికెట్‌ అకాడమీ ప్రారంభోత్సవంలో శాప్‌ చైర్మన్‌ బైరెడ్డి
ప్రజాశక్తి - విజయవాడ అర్బన్‌ 

క్రీడల్లో రాణించిన వారికి ప్రభుత్వ పరంగా మంచి అవకాశాలు ఉన్నాయని, ప్రభుత్వం క్రీడలకు విద్యకు సమాన ప్రాధాన్యత ఇస్తుందని శాప్‌ ( స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ ) చైర్మన్‌ బైరెడ్డి సిద్దార్ద రెడ్డి అన్నారు. గురునానక్‌నగర్‌లో భరత్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌ క్రికెట్‌ అకాడమిని శనివారం ఉదయం ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ప్రతిఒక్కరూ ఏదో ఒక క్రీడలో ప్రావీణ్యతను పెంచుకోవాలన్నారు. క్రీడాకారుడిగా మంచి ఉన్నత స్థాయికి వెళ్లివచ్చని అంతేకాకుండా క్రీడాకారులు రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకువచ్చి గౌరవాన్ని పెంచుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ జాయింట్‌ సెక్రటరీ ఎ.రాకేష్‌, వైసిపి విజయవాడ తూర్పు ఇన్‌చార్జి దేవినేని అవినాష్‌, ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ సిఇవో ఎం.వెంకట శివారెడ్డి, భారత్‌ బెస్ట్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌ క్రికెట్‌ అకాడమి డైరెక్టర్లు త్రినాథ్‌ నండూరి, మద్దినేని శ్రీనివాస్‌, బత్తుల సుందరరెడ్డి, పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు