Nov 06,2022 23:57

శిక్షణలో పాల్గొన్న క్రీడాకారులతో సిఐ శంకరరావు తదితరులు

ప్రజాశక్తి-అచ్యుతాపురం
క్రీడల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించడానికి ప్రత్యేకమైన శిక్షణ పొందాల్సిన అవసరం ఉందని స్థానిక సిఐ పి.శంకర్రావు అన్నారు. మండలంలోని నునపర్తి గ్రామంలో ఆదివారం శ్రీరామ బాల్‌ బ్యాడ్మింటన్‌ క్లబ్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో క్లబ్‌ క్రీడా ప్రాంగణంలో క్రీడాకారులకు శిక్షణ తరగతులను సిఐ ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు టీ షర్ట్స్‌ అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈనెల 11, 12, 13 తేదీలలో ప్రకాశం జిల్లా చేవూరులో జరగనున్న రాష్ట్ర స్థాయి సబ్‌ జూనియర్‌ అండర్‌-16 బాల బాలికల బాల్‌ బ్యాడ్మింటన్‌ పోటీల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. ఈ నెల 10వ తేదీ వరకు ఈ శిక్షణ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అచ్యుతాపురం మండలం బాల్‌ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు గొంప నరసింహనాయుడు, ప్రధాన కార్యదర్శి మాసవరపు అప్పారావు, క్లబ్‌ సభ్యులు రెడ్డి కన్నమనాయుడు, రెడ్డి దేముడు, రెడ్డి అప్పారావు, కోచ్‌ డోకుల శ్రీను, డోకుల రమేష్‌, డోకుల నరేష్‌, క్రీడాకారులు పాల్గొన్నారు.