
క్రీడల అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలి
ప్రజాశక్తి - పగిడ్యాల
క్రీడలు అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మధుసూదన్ రావు ఉన్నారు. సోమవారం పగిడ్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో రాత్రి సమయాలలో క్రీడా శిక్షణ ఇచ్చేందుకు దాతలు ఎల్ఈడి బల్బులు అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడారు. పగిడ్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసుకున్నందుకు తొమ్మిది ఎల్ఈడి బల్బులు విశ్రాంతి ఉపాధ్యాయులు రామలింగారెడ్డి, పూర్వ విద్యార్థులు వెల్ఫేర్ అసిస్టెంట్ గణేష్, వ్యాయామ ఉపాధ్యాయులు రాగన్న ఎల్ఈడి బల్బులను విరాళం ఇచ్చారన్నారు. ఒక్కొక్కటి రూ 2250 విలువ చేసే 9 ఎల్ ఈ డి బల్బులను పాఠశాలకు ఇవ్వడం జరిగిందన్నారు. దాతలు ముందుకు వచ్చి ఇలా క్రీడాకారులను ప్రోత్సహిస్తే ప్రతిభగల క్రీడాకారులు ముందుకు వస్తారన్నారు. ఎల్ఈడి విద్యుత్తు దీపాల వల్ల రాత్రి సమయంలో కూడా కబడ్డీ, ఖోఖో క్రీడా పోటీలను అలాగే క్రీడా సాధన చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఎల్ఈడి విద్యుత్ దీపాలను విరాళంగా ఇచ్చిన వారిని పదనోపాధ్యాయులు అభినందించారు. అనంతరం ఎల్ఈడి దీపాలను విరాళంగా ఇచ్చిన దాతలను వారు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుల రషీద్, ఎల్లనాయుడు, కృష్ణ, క్రీడా శ్రీ తోకల పితాంబ రెడ్డి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.