Sep 14,2023 19:02

క్రీడలకు ఎంపికైన విద్యార్థులు

ప్రజాశక్తి -పొదలకూరు :స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో మండలస్థాయి లో జరిగిన క్రీడాకారుల ఎంపికలు గురువారంతో ముగిశాయి. ఈ నెల 13,14 తేదీలలో మండలం మహమ్మదాపురం దొడ్ల సుబ్బా రెడ్డి జిల్లా ప్రజా పరిషత్‌ ఉన్నతపాఠశాలలో ఎంపికలు జరిగాయి. ఆ వివరాలను సర్వేపల్లి నియోజక వర్గం స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ కో ఆర్డినేటర్‌, మహమ్మదాపురం హైస్కూల్‌ పీడీ విజయ విశ్వేశ్వరన్‌ వెల్లడించారు. పొదలకూరు మండల పరిషత్‌ అభివద్ధి అధికారి టి. నగేష్‌ కుమారి ,మండల విద్యా శాఖాధికారి శేషాద్రి వాసు, మహమ్మ దాపురం ఉన్నత పాఠశాల హెచ్‌ఎం సిహెచ్‌ .రామకష్ణయ్య, పొదలకూరు, తాటిపర్తి, హెచ్‌ఎం కె. సనత్‌ కుమార్‌, నాగమోహన్‌ రెడ్డి పాల్గొన్నారు.