క్రీడాకారులను అభినందిస్తున్న అశోక్ బాబు
ప్రజాశక్తి-కందుకూరు :గత నెల26, 27 తేదీలలో ఈస్ట్ గోదావరి జిల్లాలోని కాకినాడలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలలో బంగారు పతకం సాధించి జాతీయస్థాయికి ఎంపికైనట్లు జిల్లా కార్యదర్శి ఎస్కే అబ్దుల్ సలాం తెలియజేశారు.ఎంపికైన క్రీడాకారులను అశోక్ బాబు ఒంగోలు అడిషనల్ ఎస్పీ (ఎఅర్) అభినందించారు.ఎంపికైన క్రీడాకారులుబాలుర విభాగంలో ఎస్‌కెషాహిద్ (కందుకూరు)బాలికల విభాగంలో ఎం .శైలజ(దర్శి) ఎంపికైన క్రీడాకారులు వున్నారు. . ఈనెల 9, 10, 11 తేదీలలో అస్సాంలోని గౌహతిలో జరగబోవు జాతీయస్థాయి పోటీలలో వీరు పాల్గొంటారు.ఎంపికైన క్రీడాకారులను ,కోచ్ పి.అఖిల్ ను అడిషనల్ ఎస్పీ ఆశోక్‌బాబు , ఆంధ్రప్రదేశ్ టైక్వాండో అసోసియేషన్ రాష్ట్ర ట్రెజరర్ జిల్లా కార్యదర్శి ఎస్‌కె అబ్దుల్ సలాం అభినందించారు.










