Aug 25,2023 22:12

ఫొటో : మాట్లాడుతున్న మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ డాక్టర్‌ శ్రావణ్‌కుమార్‌

క్రీడాకారులను ప్రోత్సహించడమే లక్ష్యం
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో చదువుకుంటున్న విద్యార్థులైన క్రీడాకారులను ప్రోత్సహించడమే లక్ష్యమని అభిరామ్‌ ఆసుపత్రి ఎమ్‌డి ఆత్మకూరు మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ కె.వి.శావణ్‌ కుమార్‌ అన్నారు. శుక్రవారం ఆత్మకూరు పట్టణంలోని ఎస్‌ఆర్‌జె డిగ్రీ కళాశాల మైదానంలో ఎంజిఆర్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ శ్రావణ్‌కుమార్‌ మాట్లాడుతూ మాజీమంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి జ్ఞాపకార్థంగా ఎంజిఆర్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు.
అనంతరం మాజీమంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం క్రీడా పోటిలను ప్రారంభించారు. ఈ సందర్భంగా యువత క్రీడలలో రాణించాలన్నారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని క్రీడాస్పూర్తితో టోర్నమెంట్‌లో ఆటలు ఆడాలని, ప్రతి ఒక్కరూ క్రీడలపై ఆసక్తి చూపితే భవిష్యత్తు బంగారు బాట అవుతుందని వారికి సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ షేక్‌ సర్దార్‌ కౌన్సిలర్‌ శివ కోటారెడ్డి, స్థానిక నాయకులు కొండా వెంకటేశ్వర్లు, సయ్యద్‌ జమీర్‌, వెంగల్‌ రెడ్డి, కోనూరు పణి కష్ణారెడ్డి, కొప్పోలు చిన్నపరెడ్డి, తోకల వెంకటేశ్వర్లు, మట్టి సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.