ప్రజాశక్తి -సీతమ్మధార : క్రీడాకారుల్లోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుంటుందని ఆంధ్రా బాక్సింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్, మారిటైం బోర్డు చైర్మన్ కాయల వెంకటరెడ్డి అన్నారు. ఇటీవల చెన్నరు నమ్మకళ్లలో జరిగిన ప్రొఫెషనల్ బాక్సింగ్ టోర్నీలో మంచి ప్రతిభ కనబరిచి పతకాలను సాధించిన ముగ్గురు బాక్సర్లను అభినందించారు. లైట్‌ఫ్లై కేటగిరిలో రెండో స్థానంలో నిలిచిన బోయి అర్జున్, ఫె ్ౖలవేట్ కేటగిరిలో విజేతగా నిలిచిన సింహాద్రిస్వామి, చెల్టర్ వెయిట్ విభాగంతో మొదటిస్థానంలో నిలిచిన కర్రి కిశోర్‌లను అభినందించి, వారికి నగదు ప్రోత్సాహకాలను అందించారు. ఈ సందర్భంగా కాయల వెంకటరెడ్డి క్రీడాకారులకు మంచి భవిష్యత్ ఉంటుందని, ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకుని రాణించి, భవిష్యత్‌ను చక్కగా దిద్దుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కోచ్ బి.వాసు, ఆంధ్రా బాక్సింగ్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఎంఎస్‌ఎస్.శ్రీనివాస్, క్రీడాకారులు పాల్గొన్నారు.










