క్రీడాకారులతో కంచర్ల రామయ్య
ప్రజాశక్తి-కందుకూరు : ఉమ్మడి ప్రకాశం జిల్లా స్రీ, పురుషుల బాస్కెట్‌బాల్ జట్లకు కందుకూరు ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజీ కరస్పాండెంట్ కంచర్ల రామయ్య సుమారు రూ. 10 వేల విలువగల క్రీడా దుస్తులను క్రీడాకారులకు గురువారం పంపిణీ చేశారు.కంచర్ల రామయ్య మాట్లాడుతూ బాగా ఆడి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ జట్లు తూర్పుగోదావరి జిల్లా మార్టేరు లో జరుగు తొమ్మిదో రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిఫ్‌లో పాల్గొంటాయి. ఈ పోటీలు నేటి నుంచి అక్టోబర్ 2 వరకు జరుగుతాయి. కార్యక్రమంలో బిస్కెట్ బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎస్ సురేష్ ,సెక్రెటరీ టి సుబ్బారావు పాల్గొన్నారు.










