క్రీడాభివృద్ధికి ప్రోత్సాహం
ప్రజాశక్తి - చాగలమర్రి
జిల్లాలో బేస్‌బాల్ క్రీడాభివృద్ధికి తమ వంతు ప్రోత్సాహం,సహకారం ఉంటుందని ఉమ్మడి కర్నూలు జిల్లా బేస్‌బాల్ సంఘం చైర్మన్,వైసీపీ రాష్ట మైనార్టీ సెల్ కార్యదర్శి షేక్ బాబులాల్ తెలియజేసారు.ఇటీవల అనంతపురం లో జరిగిన 5వ రాష్ట్రస్థాయి సీనియర్స్ బేస్‌బాల్ పోటిల్లో విజేత నిలిచిన ఉమ్మడి కర్నూలు జిల్లా జట్టును చాగలమర్రి లోని పట్టణ వైసీపీ పార్టీ కార్యాలయంలో బుధవారం అభినందన సభ ఏర్పాటు చేసారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి క్రీడలను ప్రొత్సహిస్తున్నారన్నారు. బేస్‌బాల్ క్రీడాభివృద్ధికి ఎల్లవేళలా తమ వంతు కృషి ఉంటుందన్నారు.క్రీడల్లో అత్యంత ప్రతిభ కనబరచితే జాతీయ స్థాయి లో గుర్తింపు లభిస్తుందన్నారు.అనంతరం రాష్ట్ర స్థాయి పోటీల్లో విజేతగా నిలిచిన ఉమ్మడి కర్నూలు జిల్లా జట్టు క్రీడాకారులను,జిల్లా అధ్యక్షుడు రమణయ్య,కార్యదర్శి సుబ్బయ్య,వ్యాయామ సంచాలకులను చైర్మన్ బాబులాల్,వైసిపి మండల కన్వీనర్ కుమార్ రెడ్డి,వైస్ ఎంపిపి రఫి,చక్రం బీడి,రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త ముల్లా షబ్బీర్ అహమ్మద్,గేట్లమాబు లు ఘనంగా సన్మానించారు.కార్యక్రమం లో నంద్యాల జిల్లా ఎస్‌ఏపి అధ్యక్షుడు నాగేంద్ర,వ్యాయామ సంచాలకులు దాదాపీర్, శ్రీనివాసులరెడ్డి, నరసింహ, దేవేంద్ర, ప్రచార కార్యదర్శి పెయింటర్ రఫి, జాపర్ వలి తదితరులు పాల్గొన్నారు.










