క్రీడా సామగ్రిని అందజేస్తున్న దృశ్యం
క్రీడా సామగ్రి వితరణ
కొడవలూరు:మండలంలోని కొత్తవంగల్లు హైస్కూల్‌కు అదే గ్రామానికి చెందిన ఆ పాఠశాల రిటైర్డ్ హెచ్‌ఎం రాగిపాటి శ్రీహరి రూ.10 వేల విలువైన క్రీడా సామగ్రిని వితరణగా ఇచ్చారు. వీటిని గ్రామానికి చెందిన వైసిపి నేత చక్కా మనోహర్ బాబు, ఎంపీటీసీ సభ్యులు నంబూరి ప్రసాద్ మంగళవారం విద్యార్థులకు అందజేశారు. అనంతరం ఇక్కడి పాఠశాలలో హెచ్‌ఎంగా పని చేసి బదిలీపై వెళ్లిన అక్కిరెడ్డి. ఉపాధ్యాయులు సురేష్, భూపతి, భవానీలను శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మనోహర్ బాబు మాట్లాడుతూ పాఠశాలకు హెచ్‌ఎం. ఉపాధ్యాయులు అందించిన సేవలను కొనియాడారు. విద్యార్థులను క్రీడల పరంగా ప్రోత్సహిం చేందుకు రిటైర్ట్ హెచ్‌ఎం శ్రీహరి దాతత్వాన్ని అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం రాంకుమార్, వైసిపి నేతలు మాల కొండయ్య, రఘురామయ్య, మాల్యాద్రి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.










