Oct 13,2023 01:10

ప్రజాశక్తి - అద్దంకి
దండీలు తీయడానికి అవసరమైన జింక్ బార్స్, వాలీబాల్, ఖో-ఖో, లాంగ్ జంప్ ఆటలకు కావలసిన జింక్ స్థంభాలను, 10వ తరగతి విద్యార్థులకు అట్లాసు పుస్తకాలను కాకానిపాలెం జెడ్‌పి ఉన్నత పాఠశాలకు పుట్టంరాజు బుల్లయ్య, రామలక్ష్మమ్మ చారిటబుల్ ట్రస్ట్ తరపున పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి గురువారం అందచేశారు. రూ.6వేల విలువైన వరల్డ్ అట్లాస్‌లను, రూ.4వేల విలువైన క్రీడాస్థంభాలను అందజేశారు. విశ్రాంత పిఇటి నర్రా గోపాల్ రూ.2వేల  విలువైన వాలీబాల్ బంతులు బహూకరించినట్లు హెచ్‌ఎం గురవయ్య తెలిపారు. వ్యాయామ విద్య ద్వారా విద్యార్థులలో శారీరక వికాసం జరుగుతుందని అన్నారు. నాయకత్వ లక్షణాలు చిన్ననాటి నుండే అలవడుతాయని ఎంఇఒ-2 బి సుధాకరరావు అన్నారు. విష్ణు ప్రసాద్ ఆధ్వర్యంలో అండర్ 14, అండర్ 17 బాల బాలికల సైకిల్ పోటీలు నిర్వహించారు. పోటీలకు వివిధ ఉన్నత పాఠశాలలు, జూనియర్ కాలేజీల నుండి 70మంది విద్యార్ధులు హాజరయ్యారు. వీరిలో ప్రతిభ కనబరిచిన వారిని జిల్లా స్థాయి టీంకు ఎంపిక చేశారు. ఎంపిక కాబడిన విద్యార్థులు త్వరలో బాపట్లలో జరిగే రాష్ట్రస్థాయి సైకిల్ పోటీలలో ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు. కార్యక్రమంలో సెలక్షన్ టెక్నికల్ కమిటీ మెంబర్లుగా ఫిజికల్ డైరక్టర్లు సుదర్శన్ రాజు, కె సుబ్బారావు, కోటేశ్వరరావు, సురేష్, వాసుబాబు, శారద, రవి వ్యవహరించారు.