కబడ్డీ ఆడుతున్న ఎంఇఒలు
క్రీడా పోటీలు ప్రారంభం
ప్రజాశక్తి-కావలి రూరల్:స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మండల స్థాయి అండర్ 14 క్రీడా పోటీలు మండల కోఆర్డినేటర్ పి.చిరంజీవి ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారి బి.గోవిందయ్య,1 సిహెచ్ వెంకటసుబ్బయ్య,2లు పాల్గొని ప్రారంభించారు. పది హేడు సంవత్సరాల బాల, బాలికలకు, గురువారం మండల స్థాయి సెలక్షన్ పోటీలు స్థానిక జెడ్‌పి హైస్కూల్ లో నిర్వహించడం జరిగింది. ఈ ఆటల పోటీల్లో మండల పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేటు స్కూల్స్ నుంచి దాదాపుగా నాలుగు వందల యాబై మంది క్రీడాకారులు ఈ సెలక్షన్ కు హాజరయ్యారు. బాల బాలికలకు వేర్వేరుగా వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బాల్ బ్యాడ్మింటన్, త్రో బాల్, క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఇఒలు బి గోవిందయ్య,1 సిహెచ్ వెంకటసుబ్బయ్య,2 పిల్లలతో కలిసి సరదాగా కబడ్డీ పోటీలు ఆడి వారిని ఉత్సాహపరిచారు.కార్యక్రమంలో మండల పరిధిలోని వ్యాయామం ఉపాధ్యాయులు, క్రీడాకారులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.










