Sep 26,2023 00:45

ఎనిమిదో తరగతి చదువుతున్న

ప్రజాశక్తి గొలుగొండ: మండలంలో గుండుపాల జిల్లా పరిషత్‌ హైస్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న బి. సత్య వెంకటలక్ష్మి రాష్ట్రస్థాయి రెజ్లింగ్‌ పోటీలలో సిల్వర్‌ మెడల్‌ సాధించింది. ఇటీవల. విజయవాడలో జరిగిన పోటీలలో ఆమె ఈ ఘనత సాధించింది. ఈ సందర్భంగా సోమవారం ఆమెను ప్రధాన ఉపాధ్యాయులు శ్రీరామ్మూర్తి, ఫిజికల్‌ డైరెక్టర్‌ విజరు కుమార్‌, సీనియర్‌ ఉపాధ్యాయులు ప్రకాశరావు, పాఠశాల సిబ్బంది అభినందించారు.
గొలుగొండ: స్థానిక బి.ఆర్‌.అంబేద్కర్‌ గురుకుల కళాశాల విద్యార్థులు వివిధ క్రీడా పోటీలలో జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలలో ఎంపికయ్యారుని కళాశాల ప్రిన్సిపాల్‌ రామకృష్ణ తెలిపారు. సోమవారం ఆయన స్దానిక విలేఖర్లతో మాట్లాడుతూ, కబడ్డీ పోటీలలో అండర్‌ 19 విభాగంలో నందకిషోర్‌, త్రోబాల్‌లో వెంకట శివ, సిద్ధూ, వెయిట్‌ లిఫ్టింగ్‌లో కుమారస్వామి జిల్లా స్థాయిలో ప్రతిభ చూపి రాష్ట్ర స్ధాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు. అండర్‌ - 19 విభాగం నుండి ఠాగూర్‌, శ్యామ్‌ కుమార్‌ టెన్నికాయిటులో జిల్లాస్థాయికి ఎంపిక అయ్యారు. అండర్‌17 విభాగం నుండి పురుషేశ్వర్‌, సంతోష్‌, నాగరాజులు వాలీబాల్‌ జిల్లాస్దాయికి ఎంపిక య్యారని ఆయన తెలిపారు. పోటీలకు ఎంపికయిన విద్యార్థులను సోమవారం ప్రిన్సిపాల్‌ రామకృష్ణ, పిడి శ్యామ్‌ ప్రసాద్‌, వైస్‌ ప్రన్సిపల్‌ కెవి రమణ అభినందించారు.