Oct 16,2023 21:39

ప్రజాశక్తి - పోలవరం
   ఇంటర్‌ జిల్లా సెయింట్‌ ఫ్రాన్సిస్‌ విద్యార్థుల క్రీడా పోటీల్లో పోలవరం సెంట్‌ ఫ్రాన్సిస్‌ పాఠశాల విద్యార్థులు ఓవరాల్‌ ఛాంపియన్‌గా గెలుపొందడం పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. సోమవారం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సిస్టర్‌ టీనా కొరియా కోస్‌ విజేతలకు షీల్డ్‌లు, ప్రత్యేక బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా టీనా కొరియా కోస్‌ మాట్లాడుతూ కోకో పోటీల్లో 100, 200, 400 మీటర్ల పరుగు పందెంలో జిల్లాలో దెందులూరు, ఇరుసుమండ, పోలవరం మూడు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారని, ఈ పోటీలలో తమ విద్యార్థులు గెలుపొందడం తమకు ఎంతో గర్వకారణంగా ఉందని తెలిపారు. విద్యార్థులను విజేతలుగా తీర్చిదిద్దిన వ్యాయామ ఉపాధ్యాయులు ఎస్‌.నాగేశ్వరరావు, రాజు, విజేతలను ఉపాధ్యాయులు సిబ్బంది అభినందించారు.