క్రీడా పోటీల్లో 'ఎంజిఎం' సత్తా
ప్రజాశక్తి -తిరుపతి టౌన్
స్థానిక బైరాగి పట్టెడ లోని మహాత్మా గాంధీ మున్సిపల్ హై స్కూల్ విద్యార్థులు, అక్టోబర్ 25 నుండి 30వ తేదీ వరకు శ్రీ సత్య సాయి జిల్లా చిగిచేర్లలో జరిగిన జూడో పోటీల్లో కే భవ్య పదో తరగతి విద్యార్థిని రాష్ట్రస్థాయిలో గోల్డ్ మెడల్ సాధించి, జాతీయ స్థాయికి ఎంపికయ్యింది. మరొక విద్యార్థి విద్యా వర్షిని పదవ తరగతి విద్యార్థి, బ్రాంజిమెడల్స్ సాధించింది. మరొక పదవ తరగతి విద్యార్థిని పి, తక్షయ తేజ శ్రీ పాల్గొన్నారు. రాజమండ్రిలో జరిగిన రైఫిల్ షూటింగ్‌లో ఎంజీఎం మున్సిపల్ హైస్కూల్ విద్యార్థులు ప్రతిభ చాటారు. కష్ణా జిల్లాలో జరిగిన రెజ్లింగ్ పోటీలలో ఎంజీఎం పాఠశాల నుండి ఏ చైతన్ పదవ తరగతి విద్యార్థి సిల్వర్ మెడల్ సాధించాడు. బుధవారం ప్రధానోపాధ్యాయులు ఏ మురుగన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా15 వ వార్డు కార్పొరేటర్ తూకివాకం శాలిని మహేష్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం విజేత విద్యార్థులకు మెడల్స్, సర్టిఫికెట్స్ అందజేసివిద్యార్థులను అభినందించారు.ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయుని ఎం ప్రసన్నలక్ష్మి, విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయుడు మునయ్య స్థానిక నాయకులుతూకివాకం మహేష్ రెడ్డి పాఠశాల ఉపాధ్యాయ బందం పాల్గొన్నారు.










