ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యాయవాదులకు, న్యాయవాద గుమస్తాలకు ఆటల పోటీలను నిర్వహించేందుకు కమిటీలను ఏర్పాటు చేయనున్నట్టు బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఎన్ని సూర్యారావు తెలిపారు. జిల్లా కోర్టు ఆవరణలోని బార్ అసోసియేషన్ భవనంలో కార్యవర్గ సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడలు మానసికోల్లాసానికి దోహదపడతాయని అన్నారు. ఆరోగ్యపరంగా ఎంతో ప్రయోజనం ఉంటుందని పేర్కొన్నారు. ఈ పోటీల నిర్వహణకు న్యాయమూర్తులను ఆహ్వానించాలని సభ్యులు తీర్మానించారు. అలాగే పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేయనున్నట్టు వివరించారు. సమావేశంలో అసోసియేషన్ కార్యదర్శి పి.రాము, న్యాయవాదులు జి.భాస్కరరావు, పొగిరి చిన్నారావు, భవానీప్రసాద్, ఎ.ఎల్.నారాయణ, హరిప్రియ, స్టేట్ బార్ మెంబర్ గేదెల వాసుదేవరావు, వాన కష్ణచంద్, శిష్టు రమేష్, రమణ దయాల్, మామిడి క్రాంతి, వి.దామోదర్, ఎన్.విజరుకుమార్, కె.నాగభూషణరావు, కె.సుభాష్, ఎల్.తవిటినాయుడు, జోగేంద్రనాయుడు, సనపల హరి, జయకుమార్ పాల్గొన్నారు.










