Nov 17,2022 23:14

ఆందోళన చేస్తున్న డివైఎఫ్‌ఐ నేతలు

ప్రజాశక్తి-కంచరపాలెం: ప్రభుత్వ క్రీడా మైదానాలు, ఇండోర్‌స్టేడియాలు, క్రీడా వికాస కేంద్రాలను ప్రైవేటుకు లీజుకిచ్చే నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చిట్టిబాబు కాలనీ అధ్యక్షుడు పి.గౌరీషు కోరారు.గురువారం డివైఎఫ్‌ఐ ఆధ్వర్యాన ఆందోళన చేపట్టారు. ఈసందర్భంగా డివైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజు మాట్లాడుతూ గ్రామాల్లో క్రీడోత్సవాల నిర్వహణకు సన్నాహాలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, మరోపక్క క్రీడా మైదానాలను ప్రైవేటుక లీజుకు ఇవ్వడంలో ఆంతర్యం అంతు పట్టడం లేదన్నారు. క్రీడలు, క్రీడాకారుల పట్ల ప్రభుత్వం ద్వంద్వవైఖరిని మానుకోవాలని, ఇప్పటికైనా క్రీడా మైదానాల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని మానుకుని, క్రీడలను అభివృద్థి చేయాలని కోరారు. కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ నాయకులు రఘు, ఆనంద్‌, కోటయ్య,సత్యం, రాజు, సొంసాను, జయరాజ్‌, రాములమ్మ పాల్గొన్నారు.