May 23,2023 22:39

ఎన్‌టిఆర్‌ విగ్రహం ఎదుట నిరసన వ్యక్తంచేస్తున్న టిడిపి నాయకులు, కార్యకర్తలు


ప్రజాశక్తి-సామర్లకోట రూరల్‌
ప్రస్తుత వైసీపీ పాలనలో విద్యుత్‌ కోతలు విపరీతంగా ఉన్నాయని, విద్యుత్‌ సరఫరా లేకపోయినా చార్జీలు విపరీతంగా పెరిగి పోతున్నాయని విమర్శిస్తూ పట్టణ తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షులు అడబాల కుమార స్వామి నాయకత్వంలో స్థానిక మఠం సెంటర్‌ ఎన్‌టిఆర్‌ విగ్రహం వద్ద మంగళవారం భారీ ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత వైసిపి పాలనలో పేద ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నట్టు విమర్శించారు. రాత్రి సమయాల్లో మితిమీరిన విద్యుత్‌ కోతలతో ప్రజలకు నిద్ర ఉండడం లేదన్నారు. అలాగని విద్యుత్‌ ఛార్జీలు తగడం లేదన్నారు తక్షణమే విద్యుత్‌ ఛార్జీలు తగ్గించడంతోపాటు విద్యుత్‌ కోతలను అదుపులకు తీసుకురావాలని వారు డిమాండ్‌ చేశారు.. కార్యక్రమంలో పార్టీ నాయకులు బడుగు శ్రీకాంత్‌, కంటే జగదీష్‌ మోహన్‌, బలుసు వాసు, పైణ్ణి శ్రీనివాస్‌, పడాల వీరబాబు, గోల్తి సత్యనారాయణ, ఎండి సైపుల్లా, మెండెం సర్రయ్య, కార్యకర్తలు పాల్గొన్నారు.