ప్రజాశక్తి - కలెక్టరేట్ : అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం బెరాక ప్రార్థన మందిరం సమీపంలో రానున్న క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని కరపత్రాలు పంచుతుండగా మతోన్మాద శక్తులు క్రైస్తవులపై దాడి చేయడాన్ని ఖండిస్తూ మంగళవారం ఎల్‌ఐసి దరి అంబేద్కర్ విగ్రహం వద్ద టిడిపి క్రిస్టియన్ మైనార్టీ విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షులు ఊరుకూటి డేవిడ్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మతోన్మాద శక్తులు పెట్రేగిపోతున్నాయన్నారు. తాడిపత్రి ఘటనే దీనికి నిదర్శనమన్నారు. మత స్వాతంత్య్రపు హక్కును మతోన్మాద శక్తులు కాలరాస్తున్నా, ముఖ్యమంత్రి జగన్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కార్యక్రమంలో మణికుమార్, ఉమా చౌదరి, చిన్నిబాబు, రాజ్ కుమార్, జోసఫ్ కృపాకర్, డానియల్, సాల్మన్ రాజ్ పాల్గొన్నారు.










