ప్రజాశక్తి - వేటపాలెం
విద్యార్థులు ఆత్మరక్షణ విద్యలైన కరాటే నేర్చుకోవడం వలన మానసిక, శారీరక దృఢత్వం పెంపొందించుకోవచ్చని కరాటే మాస్టర్ వి బ్రహ్మనాయుడు అన్నారు. చీమకుర్తిలోని బూచేపల్లి వెంకాయమ్మ సుబ్బారెడ్డి కళ్యాణ మండపం నందు రాష్ట్రస్థాయి 5వ కరాటే కుంగ్‌ఫు ఛాంపియన్షిప్ టోర్నమెంట్ ఆదివారం నిర్వహించారని తెలిపారు. తధాగత్ బోధి ధర్మ సిటోరియా కరాటే ఇంటర్నేషనల్ సంస్థ ఆధ్వర్యంలో పోటీలు జరిగాయని అన్నారు. పోటీలలో తమ విద్యార్థులు ఎస్ అజయ్, శ్రీరామ్, సాత్విక్, యశ్వంత్, బాన్ రోనాల్డ్ కరాటే విభాగంలో బంగారు పతకాలు అందుకున్నారని తెలిపారు. ఈ విద్యార్థుల తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లనే ఈ పథకాలు సాధించారని ఆయన తెలిపారు.










