
ప్రజాశక్తి - బాపట్ల
గుంటూరు జిల్లా మంగళగిరి ఈద్గా మసీద్ ఫంక్షన్ హాల్లో ఈనెల 29న జరిగిన జాతీయ స్థాయి 8వ ఇన్విటేషనల్ కరాటే ఛాంపియన్ షిప్2023 పోటీల్లో స్థానిక వైఎన్‌ఆర్ మార్షల్ ఆర్ట్స్ అకాడెమీలో శిక్షణ పొందిన బాపట్లకు చెందిన విద్యార్థులు పతకాల పంట పండించారని అకాడమీ వ్యవస్థాపకుడు యర్రా నాగేశ్వరరావు సోమవారం తెలిపారు. 8ఏళ్ళలోపు బాలుర విభాగంలో అకాడమీ విద్యార్థి ఈశ్వర్ ఆరంజ్ బెల్ట్, కటా, కుమితెలో బంగారు పతకం సాధించాడు. 9ఏళ్ళలోపు బాలికల విభాగంలో అనికా బ్లాక్ బెల్ట్, కటాలో వెండి, కుమితెలో బంగారు పతకం, 9ఏళ్ళలోపు బాలుర విభాగంలో లాస్మిత్ దేవ్ ఎల్లో బెల్ట్, కటాలో రజిత, కుమితేలో వెండి పతకం, 10ఏళ్ళలోపు బాలికల విభాగంలో పావన్య ఆరంజ్ బెల్ట్, కటాలో బంగారు, కుమితెలో రజితం, 11ఏళ్ళలోపు బాలుర విభాగంలో మాధవ్ బ్లాక్ బెల్ట్, కటాలో వెండి, కుమితెలో రజితం, 12ఏళ్ళలోపు బాలుర విభాగంలో పార్థు బ్లూ బెల్ట్, కటాలో బంగారు, కుమితెలో బంగారు పతకం. 13ఏళ్ళలోపు బాలికల విభాగంలో జాగృతి వెంకట సాయి గ్రీన్ బెల్ట్, కటాలో బంగారు, కుమితెలో రజిత పతకం, 13ఏళ్ళ లోపు బాలుర విభాగంలో మోహిత్ ఎల్లో బెల్ట్, కటా బంగారు, కుమితెలో వెండి పతకం, 13ఏళ్ళలోపు బాలుర విభాగంలో అల్తాఫ్ గ్రీన్ బెల్ట్, కుమితెలో వెండి పతకం, 14ఏళ్ళ లోపు బాలికల విభాగంలో సుహానా తబ్సమ్ బ్లూ బెల్ట్, కటాలో బంగారు, కుమితెలో బంగారు పతకం, 14ఏళ్ళలోపు బాలుర విభాగంలో పవన్ గ్రీన్ బెల్ట్, కటాలో బంగారు, కుమితెలో బంగారు పతకం, 15ఏళ్ళలోపు బాలుర విభాగంలో రవి బ్లాక్ బెల్ట్, కటాలో రజిత, కుమితెలో వెండి పతకం, పురుషులు విభాగంలో గొపి బ్లాక్ బెల్ట్, కుమితెలో బంగారు పతకం, రాఘవేంద్ర,గ్రాండ్ ఛాంపియన్ షిప్ ట్రోఫీ కైవసం చేసుకున్నట్లు నాగేశ్వరరావు తెలిపారు. ఓవర్ ఆల్ ఛాంపియన్ షిప్ ట్రోఫీ బాపట్ల టీం కైవసం చేసుకుందని తెలిపారు. పథకాలను కైవసం చేసుకున్న కరాటే విద్యార్థులను, కరాటేలో అత్యంత మెళకువలు నేర్పిన యర్రా నాగేశ్వరరావును అభినందించారు.