ప్రజాశక్తి - చెరుకుపల్లి
జాతీయ ఓపెన్ కరాటే ఛాంపియన్ షిప్ పోటీల్లో ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు 15పతకాలు సాధించినట్లు స్కూల్ యాజమాన్యం తెలిపింది. 800మందిపైగా దేశవ్యాప్తంగా విద్యార్థులు పోటీలలో పాల్గొన్నారని తెలిపారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ పైనం ఏడుకొండలరెడ్డి, సెక్రటరీ సాయి రంగారెడ్డి పతకాలు సాధించిన విద్యార్థులను అభినందించారు. పాఠశాలకు చెందిన కెవి రామ్ చరణ్ బంగారు, ఎన్ రాము, మణికంఠ, డి సాయి శ్రీనివాస్, ఎం బాలహనుమాన్, టి వంశీకృష్ణ, అరవింద్, మోక్షజ్ఞ కాంస్య, బి కౌశిక్ రెడ్డి రెండు విభాగాలలో కాంస్య, వివి రేవంత్ రజిత, కాంస్య, జి చరిత్ రజిత, కాంస్య పతకాలు సాధించారని తెలిపారు. పాఠశాల ప్రిన్సిపాల్ నర్గీస్ కాజీ, అకడమిక్ డైరెక్టర్ ప్రసాదరెడ్డి, కరాటే కోచ్ జి అనిల్ కుమార్, నాంచారయ్య అభినందించారు.










