Mar 13,2023 01:36
విద్యార్థులను అభినందిస్తున్న కళాశాల ప్రతినిధులు

ప్రజాశక్తి-చీరాల: జవహర్‌లాల్‌ నెహ్రూ మెమోరియల్‌ ఇంటర్‌ స్టేట్‌ ఇన్విటేషనల్‌ ఆధ్వర్యంలో చిలకలూరిపేటలో జరిగిన అంతర్రాష్ట్రస్థాయి కరాటే పోటీలలో పట్టణంలోని సందీప్‌ ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఆదివారం జరిగిన ఈ పోటీలలో బాపట్ల జిల్లా తరఫున చీరాలలోని సందీప్‌ ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌ విద్యార్థులు పాల్గొన్నారు. కటా విభాగంలో జూనియర్‌ రెడ్‌ బెల్ట్‌ స్థాయిలో జరిగిన పోటీలలో ఏ భవ్య శ్రీదేవి గోల్డ్‌ మెడల్‌ను సాధించింది. ఎల్లో బెల్ట్‌ సీనియర్స్‌ విభాగంలో జరిగిన పోటీలలో కాటా విభాగంలో సిహెచ్‌ పూజిత ద్వితీయ బహుమతిని, ఆర్‌ సాహితి తృతీయ బహుమతిని సంపాదించగా ఎల్లో బెల్ట్‌ జూనియర్‌ విభాగంలో జరిగిన పోటీలలో ఏ వసంత కటా విభాగంలో ద్వితీయ బహుమతిని పొందింది. వీరందరూ చీరాలలోని సందీప్‌ ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌కి చెందిన విద్యార్థులు కావడం విశేషం. సందీప్‌ ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌ వ్యవస్థాపకులు డాక్టర్‌ తుల్లూరి వెంకటేశ్వర్లు పోటీలలో గెలిచిన విజేతలను, కరాటే మాస్టర్‌ నక్కల శివప్రసాదును ప్రశంసించారు.