విద్యార్థులను అభినందిస్తున్న సెయింట్ జేవియర్స్ ప్రధానోపాధ్యాయులు
కరాటే ఛాంపియన్లకు సత్కారం
ప్రజాశక్తి-శ్రీకాళహస్తి నెల్లూరులో జరుగుతున్న జాతీయ స్థాయి కరాటే చాంపియన్షిప్ పోటీల్లో పట్టణానికి చెందిన సెయింట్ జేవియర్స్ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. ఆ పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్న విద్యార్థి క్లారిస్, మూడో తరగతి చదువుతున్న తన చెల్లెలు ఆరాధ్య లు తమ తమ విభాగాల్లో సత్తా చాటి ఛాంపియన్ షిప్ ట్రోఫీని గెలుపొందారు. ఈ సందర్భంగా ప్రతిభ చూపిన విద్యార్థులను ప్రధానోపాధ్యాయులు షేర్లీ, శిక్షకుడు ధనుష్ అభినందించి సత్కరించారు.
విద్యార్థులను అభినందిస్తున్న సెయింట్ జేవియర్స్ ప్రధానోపాధ్యాయులు










