Jun 29,2023 21:35

క్రాప్‌ ఇన్సూరెన్స్‌కు కసరత్తురూ.204 కోట్లతో ప్రతిపాదనలు

జులై 8న నిధులు విడుదల?
 కడప ప్రతినిధి : గత ఖరీఫ్‌ సీజన్‌లో అకాలవర్షాలు, వర్షాభావాల కారణంగా దెబ్బ తిన్న పంటలకు క్రాప్‌ ఇన్సూరెన్స్‌ విడుదలకు కసరత్తు ఊపందుకుంది. ఈమేరకు జిల్లా వ్యవసాయశాఖ 2022-23 ఖరీఫ్‌ సీజన్‌లో 1,93,095 ఎకరాల్లో పంటల సాగుకు ప్రణాళిక రూపకల్పన చేసిన సంగతి తెలిసిందే. ఖరీప్‌ సీజన్‌ సీజన్‌ ముగింపు నాటికి పత్తి, కందులు, ఉల్లి, వరి, నిమ్మ, వేరుశనగ, ఇతర రకాల పంటలు అకాలవర్షాలు, వర్షాభావాల కారణంగా నష్టపో యిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో జిల్లా వ్యవసాయశాఖ జిల్లా లోని రైతులు రూ.204 కోట్ల మేర నష్టపోయినట్లు గుర్తించి, దెబ్బతిన్న పంటల వివరాలను అందజేసింది. ఈమేరకు రాష్ట్రప్రభుత్వం తాజా ఖరీఫ్‌ సీజన్‌ నాటికి క్రాప్‌ ఇన్సూరెన్స్‌ను విడుదల చేయడానికి కసరత్తు చేస్తున్న ట్లు సమాచారం. ఈమేరకు జిల్లా వ్యవసాయశాఖ దెబ్బతిన్న పంటలను ఎన్యూమరేషన్‌ చేసి అందజేసింది. ఇందులోభాగంగా జులై ఎనిమిదిన మా జీ ముఖ్య మంత్రి వైఎస్‌ఆర్‌ జయంతి సందర్భంగా క్రాప్‌ ఇన్సూరెన్స్‌ నిధు లను విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో ప్రధాన మైన వివరాలైన దెబ్బతిన్న పంటల విస్తీర్ణం, ఆయా మండ లాల్లో పంటల వివరాలు, బాధిత రైతుల వివరాల జాబితాను తయారు చేసే పనుల్లో జిల్లా వ్యవ సాయశాఖ నిమగమై ఉన్నట్లు తెలుస్తోంది.