Jul 29,2023 21:44

పట్టణంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తున్న సిపిఎం నాయకులు, కార్యకర్తలు

ప్రజాశక్తి - కలెక్టరేట్‌ : మణిపూర్‌లో జరుగుతున్న మారణ హౌమానికి, మహిళలను వివస్త్రలను చేసి, అత్యాచారం చేసి హత్య చేసినందుకుగా పార్వతీపురం పట్టణంలో వివేకానంద కాలనీలో సిపిఎం ఆధ్వర్యాన శనివారం కొవ్వొత్తులతో ర్యాలీ చేశారు. ఈ ర్యాలీని ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం అడవి, అటవీ ఉత్పత్తులుపైనా, గనులు, ఖనిజ సంపదపై ఆధిపత్యాన్ని సాధించడానికి మైనింగ్‌ మాఫియాతో చేతులు కలిపి అభివద్ధి చెందిన మోతీ తెగకు ఎస.టి రిజర్వేషన్‌ కల్పించిందని అన్నారు. ఇది అన్యాయమని అంటున్న కుకీ గిరిజనుల పై దాడి, దౌర్జన్యం చేసి ఆస్తులు, ప్రాణ నష్టం కల్పిస్తుందన్నారు. అలాగే మహిళలపైన ,దాడులు చేసి, హింసను సష్టించి, అత్యాచారం చేసి నగంగా ఊరేగించడం సభ్య సమాజానికి సిగ్గుచేటని, ఈ సంఘటనను ప్రజలంతా ఖండించాలని డిమాండ్‌ చేశారు. ఈ దారుణాన్ని చూపి ప్రపంచమే విస్తుపోయిందన్నారు. ఈ ఆరాచకమంతా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కనుసన్నల్లోనే జరుగుతుందన్నారు. ఇంతటి దారుణానికి కారకుడైన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని వెంటనే గద్దెదించాలని, హింసను సష్టించిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. బలహీన తెగకు చెందిన అడవి జాతి కుకీలపై మెజారిటీగా ఉండి అభివద్ధి చెందుతున్న మూతి తెగలోని ఆర్‌ఎస్‌ఎస్‌ గుండాలు దాడిని ఖండించాలని పిలుపునిచ్చారు. సిపిఎం నాయకులు బంకురు సూరిబాబు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు వి.ఇందిర, ఐద్వా జిల్లా నాయకులు గౌరీశ్వరి, జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.